సీరియస్ యాక్షన్ లోకి దిగిన జగన్ సర్కార్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ట్రెజరీ ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేసింది. తక్షణమే ఉద్యోగుల జీతాలను ప్రాసెస్ చేయాలని ఆదేశించింది.

Update: 2022-01-29 12:34 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ట్రెజరీ ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేసింది. తక్షణమే ఉద్యోగుల జీతాలను ప్రాసెస్ చేయాలని ఆదేశించింది. ట్రెజరీ ఉద్యోగులతో పాటు డీడీఓలకు ఈ మేరకు ప్రభుత్వం మెమోలు జారీ చేసింది. జీతాలు ప్రాసెస్ చేయకపోతే క్రమశిక్షణ చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది. ఈ మేరకు జిల్లా కల్లెక్టర్లకు కూడా ఆదేశాలు అందాయి. తక్షణమే ఉద్యోగుల జీతాల చెల్లింపు ప్రాసెస్ ను పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

కొత్త పీఆర్సీ ప్రకారం....
ఇక ఒకటోతేదీకి మూడురోజుల సమయం మాత్రమే ఉంది. కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు చెల్లించాలని ప్రభుత్వం చెబుతోంది. తమకు పాత జీతాలు ఇవ్వాలని ఉద్యోగులు కోరుతున్నారు. కొత్త పీఆర్సీ జీవోను రద్దు చేయాలంటూ ఉద్యోగులు వచ్చే నెల ఆరవ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి వెళుతున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రభుత్వం, ఉద్యోగుల మధ్య పీఆర్సీ వార్ జరుగుతున్నట్లు కన్పిస్తుంది.


Tags:    

Similar News