ఇంటర్ విద్యార్థులకు అలర్ట్ : జంబ్లింగ్ విధానంలో ప్రాక్టికల్స్ రద్దు

ఏపీ ప్రభుత్వం ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలను జంబ్లింగ్ విధానంలో నిర్వహించాలంటూ తీసుకొచ్చిన నోటిఫికేషన్ ను..;

Update: 2022-03-10 07:30 GMT
crda works, affidavit, chefi secratary,  high court, andhra pradesh
  • whatsapp icon

అమరావతి : ఆంధ్రప్రదేశ్ ఇంటర్ విద్యార్థులకు హైకోర్టు గుడ్ న్యూస్ చెప్పింది. ఇటీవల ఏపీ ప్రభుత్వం ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలను జంబ్లింగ్ విధానంలో నిర్వహించాలంటూ తీసుకొచ్చిన నోటిఫికేషన్ ను హైకోర్టు సస్పెండ్ చేసింది. జగన్ సర్కార్ జంబ్లింగ్ విధానంలో ప్రాక్టికల్స్ నిర్వహించాలని తీసుకొచ్చిన జీఓపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ పై హైకోర్టు నేడు విచారణ చేసింది.

పిటిషన్ పై విచారణ చేసిన హైకోర్టు.. ప్రాక్టికల్స్ నిర్వహణపై ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓను కొట్టివేసింది. పాతవిధానంలోనే ప్రాక్టికల్స్ నిర్వహించాలని తీర్పు వెలువరించింది. కోర్టు తీర్పు ప్రకారం ఇంటర్ విద్యార్థులు ఎప్పటిలాగే తాము చదివే కాలేజీల్లోనే ప్రాక్టికల్స్ రాయచ్చు. హైకోర్టు తీర్పుతో ఏపీ ఇంటర్ విద్యార్థులకు కాస్త ఊరట లభించిందనే చెప్పాలి.



Tags:    

Similar News