మంత్రి విశ్వరూప్ హెల్త్ బులెటిన్ విడుదల.. నిలకడగా ఆరోగ్యం
ఆయనను కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని సిటీ న్యూరో సెంటర్లో చేర్పించారు. అక్కడ మంత్రిని పరీక్షించిన..;
ఏపీ రవాణాశాఖ మంత్రి పినిపే విశ్వరూప్ నిన్న స్వల్పంగా బ్రెయిన్ స్ట్రోక్ కు గురైనట్లు నిన్న రాజమండ్రి వైద్యులు తెలిపారు. దాంతో ఆయనను కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని సిటీ న్యూరో సెంటర్లో చేర్పించారు. అక్కడ మంత్రిని పరీక్షించిన వైద్యులు.. నేడు ఆయన హెల్త్ బులెటిన్ ను విడుదల చేశారు. మంత్రికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని వైద్యులు నిర్ధారించారు. ప్రస్తుతం మంత్రి ఆరోగ్యం నిలకడగానే ఉందన్న వైద్యులు.. ఇప్పటికైతే ఆయన ఆరోగ్యానికి ప్రమాదం లేదన్నారు.
నిన్న దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రి.. ఉన్నట్లుండి అనారోగ్యానికి గురయ్యారు. వెంటనే రాజమండ్రిలో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. వైద్యులు ఆయన స్వల్పంగా బ్రెయిన్ స్ట్రోక్ కు గురైనట్లు తెలిపారు. అక్కడి నుంచి ఆయనను హైదరాబాద్ కు తరలించారు.