కాకినాడలో జనసేన కేంద్రంగా కాపు రాజకీయాలు

ఏపీ రాజకీయాల్లో ప్రతి రోజు రాజకీయ రగడ కొనసాగుతూనే ఉంటుంది. ఒకరిపై ఒకరు విమర్శలు, ఆరోపణలు, మాటల యుద్దాలు ..

Update: 2023-09-22 02:44 GMT

ఏపీ రాజకీయాల్లో ప్రతి రోజు రాజకీయ రగడ కొనసాగుతూనే ఉంటుంది. ఒకరిపై ఒకరు విమర్శలు, ఆరోపణలు, మాటల యుద్దాలు ఇలా ఒకటేమిటి రకరకాల రాజకీయాలు రోజు కనిపిస్తూనే ఉంటుంది. అందులో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయమిది. ఇంకాస్తా రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇక తాజాగా జనసేన కూడా దూకుడు పెంచింది. జనసేనను మరింత బలోపేతం చేసేందుకు ప్రయత్నిలు మరింత ముమ్మరం చేస్తోంది. కులాల వారీగా ఆకర్షించేందుకు వ్యూహాలు రచిస్తోంది జనసేన. ఇక పవన్‌ కళ్యాణ్‌కు మద్దతిచ్చి కాపుల ఐక్యత కృషి చేయాలని జనసేన పార్టీ కాకినాడ నగర నేతలు కాపు సంఘాల నేతలకు పిలుపునిచ్చారు. వైఎస్సార్‌ సీపీ నేతల ఒత్తిడి వల్లే మొన్న కాకినాడ సమావేశంలో కొందరు కాపు నేతలు జనసేన-టీడీపీ పొత్తును వ్యతిరేకించారని వారు ఆరోపించారు.

రాజ్యాధికారం దిశగా అడుగులు వేస్తున్న పవన్‌ ఆలోచనలకు అనుగుణంగా మద్దతు ఇవ్వాల్సిన బాధ్యత కాపులందరిపై ఉందని అన్నారు జనసేన నేతలు. ఇక నుంచి ఉమ్మడిగానే పోరాటం చేద్దామని పవన్‌ కల్యాణ్‌ ఇచ్చిన పిలుపును కాపు సంఘాల నేతలు సానుకూలంగా అర్థం చేసుకోవాలని కోరారు. కాపు సంఘం సమావేశంలో నిన్న కీలక వ్యాఖ్యలు చేశారు కాపు సంఘం నేతలు. టీడీపీతో పవన్‌కళ్యాణ్‌ కలిసి పోటీకి దిగితే మద్దతు ఇచ్చేది లేదని తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. జనసేన ఒంటరిగా పోటి చేస్తేనే కాపుల మద్దతు ఉండాలని చెప్పారట.

అయితే మొన్న కాకినాడలో కొందరు కాపు సంఘం నేతలు సమావేశం నిర్వహించి జనసేన ఒంటరిగా పోరాడితేనే మద్దతిస్తామని ప్రకటించడం కలకలం రేపింది. టీడీపీతో పొత్తును వాళ్లు తీవ్రంగా వ్యతిరేస్తున్నారు. అయితే సమావేశం నిర్వహించిన కాపు సంఘం నేతల్లో కొందరు న్యాయవాదులు, చిరంజీవి, పవన్‌ కళ్యాణ్‌ అభిమానులు కూడా ఉన్నారు. ఇలా అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో జనసేన ఎత్తుగడలు వేస్తోంది. రాబోయే ఎన్నికలలో ఓటర్లను ప్రసన్నం చేసేందుకు ఒక ప్రణాళికతో ముందుకు వెళ్తోంది.
Tags:    

Similar News