ఏపీలో పెరిగిన కరోనా మరణాలు.. కొత్తగా 13 వేలకు పైగా కేసులు !

అత్యధికంగా విశాఖ జిల్లాలో 1988, ప్రకాశం జిల్లాలో 1589, గుంటూరులో 1422, అనంతపురంలో 1345, నెల్లూరులో 1305

Update: 2022-01-25 12:20 GMT

ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. తాజాగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కరోనా బులెటిన్ విడుదల చేసింది. ఆ బులెటిన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో 46,929 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 13,819 మందికి పాజిటివ్ గా నిర్థారణ అయింది. వీటిలో అత్యధికంగా విశాఖ జిల్లాలో 1988, ప్రకాశం జిల్లాలో 1589, గుంటూరులో 1422, అనంతపురంలో 1345, నెల్లూరులో 1305, కర్నూల్ లో 1255, కడపలో 1083, తూ.గో జిల్లాలో 1001 కొత్త కేసులు వెల్లడయ్యాయి.

Also Read : బాలికల గురుకులంలో కరోనా కలకలం.. ఎనిమిది మందికి పాజిటివ్ !

ఇదే సమయంలో 5,716 మంది కరోనా నుంచి కోలుగా.. 12 మంది మరణించారు. వీటితో కలిపి రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 14,561కి పెరిగింది. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 22,08,955 పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. 20,92,998 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,01,396 యాక్టివ్ కేసులుండగా.. వారంతా ఆస్పత్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స తీసుకుంటున్నారు.

Tags:    

Similar News