ఏపీ ప్రజలకు అలెర్ట్.. బయటకు వస్తే మాత్రం?

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది;

Update: 2024-03-30 07:22 GMT
traffic restrictions, tomorrow, visit, vijayawada, ys jagan
  • whatsapp icon

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. రేపు 50 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశముందని తెలిపింది. వీలయినంత వరకూ ఇంటి నుంచి బయటకు రావద్దని, అత్యవసర పనుల కోసం వస్తే మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తు నిర్వహణ సంస్థ ఏపీ ప్రజలకు సూచించింది.

రేపు, ఎల్లుండి కూడా...
రేపు యాభై మండలాలు, ఎల్లుండి 56 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. శుక్రవారం 31 మండలాల్లో వడగాల్పులు వీచాయన్నారు. కడప జిల్లా ముద్దనూరు లో తీవ్ర వడగాల్పు వీచినట్లు తెలిపారు. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు


Tags:    

Similar News