సీజేఐ ఎన్ వి రమణ ను కలిసిన సీఎం జగన్ దంపతులు
కడప నుంచి విజయవాడకు వచ్చిన సీఎం.. నేరుగా నొవోటెల్ హోటల్ కు వెళ్లి.. అక్కడ బస చేస్తున్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ను కలిశారు.
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీరణ ఏపీలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా శనివారం ఉదయం ఎన్వీ రమణ దంపతులు విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న కనకదుర్గమ్మను దర్శించుకున్న సంగతి తెలిసిందే. తాజాగా.. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన భార్య భారతితో కలిసి జస్టిస్ ఎన్వీ రమణను మీట్ అయ్యారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా మూడ్రోజులు కడప జిల్లా పర్యటనకు వెళ్లిన జగన్.. శనివారం మధ్యాహ్నం తన పర్యటనను ముగించుకుని విజయవాడ చేరుకున్నారు.
కడప నుంచి విజయవాడకు వచ్చిన సీఎం.. నేరుగా నొవోటెల్ హోటల్ కు వెళ్లి.. అక్కడ బస చేస్తున్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ను కలిశారు. ఏపీలో ప్రస్తుత రాజకీయ పరిణామాల గురించి జగన్ సీజేఐతో జగన్ ప్రస్తావించినట్లు తెలుస్తోంది. కాగా.. సీజేఐ ఎన్వీ రమణ గౌరవార్థం ఏపీ సర్కారు తేనీటి విందును ఏర్పాటు చేసింది. ఈరోజు సాయంత్రం 5 గంటలకు విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగే తేనీటి విందులో సీజేఐ ఎన్వీ రమణ, సీఎం జగన్ సహా పలువురు మంత్రులు, న్యాయమూర్తులు, న్యాయవాదులు కూడా పాల్గొననున్నారు.