సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారికి గుడ్ న్యూస్

సంక్రాంతికి సొంత గ్రామాలకు వెళ్లేవారికి ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది.;

Update: 2025-01-07 12:49 GMT

సంక్రాంతికి సొంత గ్రామాలకు వెళ్లేవారికి ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీ నుంచి తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాలకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇతర రాష్ట్రాల్లో ఉన్న వారు సొంతూళ్లకు ఏపీకి సంక్రాంతి పండగకు సులువుగా వచ్చేందుకు వీలుగా ప్రత్యేక బస్సులను తీసుకువస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు ప్రకటించారు. రేపటి నుంచి ఈ ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉండనున్నాయి. రేపటి నుంచి పదమూడో తేదీ వరకూ ఏపీకి బస్సులు నడుపుతున్నట్లు తెలిపింద.ి హైదరాబాద్ నుంచిఏపీలోని పలు ప్రాంతాలకు 2,153 బస్సులు, బెంగళూరు నుంచి375, విజయవాడ నుంచి 300 ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని తెలిపారు.

తిరుగు ప్రయాణంలో....
తిరుగు ప్రయాణానికి అవసరమైన బస్సులు కూడా ఏర్పాటు చేస్తున్నామని ఏపీఎస్ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈనెల 16వ తేదీ నుంచి 20వ తేదీ వరకూ ఈ ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు. అయితే ముందుగా బుక్ చేసుకున్న వారికి రాయితీలు కూడా ప్రకటించింది. ఒకే సారి రెండు వైపుల ప్రయాణం కోసం టిక్కెట్లు బుక్ చేసుకుంటే టిక్కెట్ ధరలో పది శాతం రాయితీ ఇస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు ప్రకటించారు. సురక్షితమైన ప్రయాణం కోసం ఆర్టీసీలోనే ప్రయాణించాలని వారు ప్రజలకు పిలుపు నిచ్చారు.

ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App నౌ




Tags:    

Similar News