ఏపీలో పీఆర్సీ చిచ్చు... జేఏసీ నుంచి తప్పుకుంటూ?

పీఆర్సీ సాధన సమితిలో భాగంగా ఉన్న ఏపీటీఎఫ్ ఇప్పటికే జేఏసీ నుంచి పక్కకు తప్పుకుంది

Update: 2022-02-08 03:22 GMT

ఆంధ్రప్రదేశ్ లో పీఆర్సీ ఉద్యోగ సంఘాల నేతల మధ్య చిచ్చు పెట్టింది. పీఆర్సీ సాధన సమితి ప్రభుత్వంతో జరిపిన చర్చల్లో సాధించిందేమీ లేదని ఉపాధ్యాయ సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. ఉపాధ్యాయ సంఘాలు తమ నిరసను ప్రారంభించాయి. కొత్త పీఆర్సీతో తమకు అన్యాయం జరుగుతుందని, హెచ్ఆర్ఏ శ్లాబుల వల్ల కూడా తాము నష్టపోతున్నామని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. నిన్న ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు.

నేడు యూటీఎఫ్
పీఆర్సీ సాధన సమితిలో భాగంగా ఉన్న ఏపీటీఎఫ్ ఇప్పటికే జేఏసీ నుంచి పక్కకు తప్పుకుంది. ఈరోజు మరో ప్రధాన సంఘమైన యూటీఎఫ్ కూడా జేఏసీ నుంచి తప్పుకోనుంద.ి నేడు యూటీఎఫ్ కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. ఉపాధ్యాయ సంఘాలు, కాంటాక్ట్ ఉద్యోగులతో కలసి కొత్త జేఏసీని ఏర్పాటు చేయాలన్న ప్రయత్నంలో ఉన్నారు. కొత్త స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసి ఉద్యమ కార్యాచరణను సిద్దం చేయనున్నాయి.


Tags:    

Similar News