అరకు ఉత్సవాలకు కోటి విడుదల
ఆంధ్రప్రదేశ్ లో ఈనెల 31వ తేదీ నుంచి అరకు ఉత్సవాలు జరగనున్నాయి.;

ఆంధ్రప్రదేశ్ లో ఈనెల 31వ తేదీ నుంచి అరకు ఉత్సవాలు జరగనున్నాయి. ఈ నెల 31వ తేదీ నుంచి వచ్చేనెల రెండో తేదీ వరకు అరకు ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తారని భావించిన ప్రభుత్వం ఇబ్బందులు పడకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.
ఉత్సవాల కోసం...
అయితే అరకు ఉత్సవాల కోసం ప్రభుత్వం కోటి రూపాయలు కేటాయించింది. ఈ మేరకు పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ ఉత్తర్వులు జారీచేశారు. ఉత్సవాల నిర్వహణకు అల్లూరి జిల్లా కలెక్టర్ నుంచి వచ్చిన ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదించింది. అరకు ఉత్సవాలను భారీగా నిర్వహించడమే కాకుండా అరకు కాఫీని కూడా ఈ సందర్భంగా ప్రమోట్ చేయనున్నారు.