ఎన్నికల ప్రచారానికి నేటితో ఎండ్
ఆంధ్రప్రదేశ్ లో శాసనసభ ఎన్నికలకు నేటితో తెరపడనుంది. ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు ప్రచారం ముగియనుంది
ఆంధ్రప్రదేశ్ లో శాసనసభ ఎన్నికలకు నేటితో తెరపడనుంది. ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు ప్రచారం ముగియనుంది. ఆంధ్రప్రదేశ్ లో ౧౭౫ శాసనసభ నియోకవర్గాలకు, 25 పార్లమెంటు స్థానాలకు, తెలంగాణలోని 17 పార్లమెంటు స్థానాలకు ఏప్రిల్ 18న నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. ఈ నెల 13వ తేదీన పోలింగ్ జరగనుంది. ఇంటింటికీ ప్రచారాన్ని మాత్రం నిర్వహించుకునే వీలుంది. మైకులు ఉపయోగించరాదు.
48 గంటల ముందు...
పోలింగ్ కు 48 గంటల ముందు ప్రచారాన్ని ముగించాల్సి ఉంటుంది. దీంతో నేటి సాయంత్రం నుంచి మైకులు మూగబోనున్నాయి. ఈ సమయంలోఎలాంటి సర్వేలు కానీ, ఎగ్జిట్ పోల్స్ కాని బయటకు వెల్లడించకూడదని ఎన్నికల కమిషన్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఎలాంటి సమావేశాలను అభ్యర్థులు నిర్వహించకూడదు. నేటితో ప్రచారం ముగియనుండటంతో ఇక అభ్యర్థులు పోలింగ్ పై దృష్టి పెట్టనున్నారు.