లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవిపై ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఏమన్నారంటే?
సీబీఐ ఎంక్వయిరీని సీరియస్ గా తీసుకోవాలని అమిత్ షాకి ఫిర్యాదు చేశానని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తెలిపారు;

సీబీఐ ఎంక్వయిరీ సీరియస్ గా తీసుకోవాలని అమిత్ షాకి ఫిర్యాదు చేశానని జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తెలిపారు. కడప నియోజకవర్గ పరిధిలో సజ్జల రామకృష్ణారెడ్డి బంధువు యాభై మూడు ఎకరాలు ఆక్రమించినట్లు గుర్తించామన్న ఆయన జిల్లాలో జరిగిన భూకబ్జాలపై త్వరలోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా విచారించనున్నారని తెలిపారు. వర్గ విభేదాలు అనేవి చిన్నచిన్న కారణాలే తప్ప అభివృద్ధిలో ఎక్కడ లోపం లేదని ఆయన తెలిపారు. జిల్లా అభివృద్ధి కోసం కేంద్రం నుండి జితేంద్ర సింగ్ పర్యటించారని, జిల్లా అభివృద్ధిలో కూటమి ప్రభుత్వం రాజీపడదన్నారు.
కడప స్టీల్ ప్లాంట్ విషయంలో...
కడప స్టీల్ ప్లాంట్ కోసం మొన్న బడ్జెట్ లో జే ఎస్ డబ్ల్యూకు 25 కోట్లు టెండర్లకు ఆహ్వానించామని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తెలిపారు. అలాగే 140 కోట్ల వ్యయంతో ట్రాన్స్ కో లైన్లకు పిలుపునిచ్చామని తెలిపారు. దావోస్ లో జరిగే సదస్సులో కడప స్టీల్ ప్లాంట్ పై కూటమి ప్రభుత్వం చర్చించబోతున్నారన్నారు. డిప్యూటీ సీఎం గా లోకేష్ ను చేయమనడం టిడిపి నేతలు అడగడంలో తప్పులేదన్న ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి జరగబోయే రాష్ట్ర అభివృద్ధి మోదీ సహకారంతోని అని అన్నారు. జమ్మలమడుగు మండలంలో జరిగిన అవినీతిపై ఫిర్యాదులు చాలావచ్చాయని ఆయన తెలిపారు.