నేడు బెజవాడకు జేపీ నడ్డా

భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నేడు ఏపీలో లో పర్యటించనున్నారు. రెండు రోజుల పాటు పర్యటించనున్నారు.

Update: 2022-06-06 02:22 GMT

భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నేడు ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారు. రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈరోజు జేపీ నడ్డా విజయవాడకు చేరుకుంటారు. విజయవాడలో శక్తి కేంద్రాల ఇన్ ఛార్జిలతో జేపీ నడ్డా సమావేశమవుతారు. సాయంత్రం విజయవాడ నగర ప్రముఖులతో సమావేశమవుతారు. అనంతరం ఆయన రాష్ట్ర కోర్ కమిటీ, ప్రధాన కార్యదర్శులతో భేటీ అవుతారు.

రాజకీయ పరిణామాలపై....
జేపీ నడ్డా రేపు రాజమండ్రిలో జరిగే బహిరంగ సభలో కూడా పాల్గొంటారు. జేపీ నడ్డా రాష్ట్రానికి వస్తుండటంతో పార్టీ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, భవిష్యత్ లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలతో నేడు జేపీ నడ్డా చర్చించనున్నారు.


Tags:    

Similar News