ఇంటింటికి స్టిక్కర్ అంటించండి
ఏపీ లో బీజేపీని బలోపేతం చేసే బాధ్యత శక్తి కేంద్రాల ఇన్ ఛార్జిలపై ఉందని పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో బీజేపీని బలోపేతం చేసే బాధ్యత శక్తి కేంద్రాల ఇన్ ఛార్జిలపై ఉందని పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. ఆయన విజయవాడలో జరిగిన సభలో మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితిలో ఏపీకి బీజేపీ అవసరం చాలా ఉందని అన్నారు. మార్పు కోసం ప్రతి ఇంటికి బీజేపీ స్టిక్కర్ ను అందించాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రతి ఇంటికి వెళ్లి వివరించాలని జేపీ నడ్డా ఇన్ ఛార్జిలకు పిలుపునిచ్చారు.
కేంద్ర పథకాలే....
కేంద్ర ప్రభుత్వం అమలు పరుస్తున్న ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ఆరోగ్యశ్రీగా మార్చారని అన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలనింటికి తమ స్టిక్కర్ అంటించుకుని వైసీపీ ప్రభుత్వం పబ్బం గడుపుకుంటుందని ఆయన ఆరోపించారు. రైతులకు ఇచ్చే అన్ని పథకాలు కేంద్రం నుంచి వస్తున్నవేనని ఆయన చెప్పారు. ప్రజలను మభ్యపెడుతున్న ఈ ప్రభుత్వం తీరును ప్రజల ముందు ఎండగట్టే బాధ్యతను తీసుకోవాలన్నారు.