కాళేశ్వరం వల్లనే అసలు ముప్పు
భద్రాచలానికి వరద ముప్పు కాళేశ్వరం ప్రాజెక్టు వల్లనే వచ్చిందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ అన్నారు
భద్రాచలానికి వరద ముప్పు కాళేశ్వరం ప్రాజెక్టు వల్లనే వచ్చిందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ అన్నారు. పోలవరం కాదని ఆయన అన్నారు. టీఆర్ఎస్ నేతలు పోలవరంపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టును ఆపివేయాలన్న కుట్ర జరుగుతుందని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఒక్కసారి గేట్లు తెరవడం వల్లనే భద్రాచలంతో పాటు ఇతర ప్రాంతాలు ముంపునకు గురయ్యాయని సీఎం రమేష్ తెలిపారు.
సత్సంబంధాలతోనే...
టీఆర్ఎస్ పోలవరం ఆపాలని చూస్తున్నా, అసత్య ప్రచారం చేస్తున్నా వైసీపీ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. ఇద్దరికి సత్సంబంధాలు ఉండబట్టే టీఆర్ఎస్ విమర్శలకు నోరు మెదపడం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ లో వరద బాధితులకు ప్రభుత్వం సాయం చేయడం లేదన్నారు. పంచాయతీరాజ్ నిధులను పక్కదారి పట్టించిందని, సర్పంచ్ లను ఢిల్లీకి తీసుకు వచ్చి వారితో ఫిర్యాదు చేయిస్తామని సీఎం రమేష్ తెలిపారు. ఇప్పటికైనా వరద బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.