ప్రకాశం బ్యారేజ్ ను బోట్లు ఢీకొన్న కేసులో నిందితులకు రిమాండ్

సెప్టెంబర్ 1న ప్రకాశం బ్యారేజీ కౌంటర్ వెయిట్లను

Update: 2024-09-09 14:35 GMT

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టిన ఘటనలో విజయవాడ పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. కుక్కలగడ్డకు చెందిన ఉషాద్రి, సూరాయపాలెంకు చెందిన కోమటిరెడ్డి రామ్మోహన్ ను అదుపులోకి తీసుకున్నారు. వీరిని విజయవాడ కోర్టులో ప్రవేశపెట్టగా.. ఇద్దరు నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో నిందితులను పోలీసులు జిల్లా జైలుకు తరలించారు. ఈ ఘటనపై లోతైన దర్యాప్తు జరిపేందుకు నిందితులను పోలీసులు కస్టడీకి కోరే అవకాశం ఉంది.

సెప్టెంబర్ 1న ప్రకాశం బ్యారేజీ కౌంటర్ వెయిట్లను పడవలు బలంగా ఢీకొట్టాయి. దీంతో 67, 69, 70 గేట్ల వద్ద దాదాపు 17 టన్నుల కౌంటర్ వెయిట్లు ధ్వంసమయ్యాయి. ఈ పడవల యజమానుల విషయంలో దర్యాప్తు జరిపిన పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. బోట్ల ఓనర్లు వైసీపీకి చెందిన వారని టీడీపీ ఆరోపిస్తూ ఉండగా.. వైసీపీ టీడీపీ చేస్తున్న డైవర్షన్ రాజకీయాలు, బోట్ల ఓనర్ కు టీడీపీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని కౌంటర్ వేస్తున్నారు.


Tags:    

Similar News