YSRCP : ఫ్యాన్ పార్టీలో ముంబయి నటి కేసు ప్రకంపనలు

వైసీపీలో ముంబయి నటి వ్యవహారం తలనొప్పిగా మారింది. పార్టీ అధినేత జగన్ కు ఇది ఇబ్బందికరంగా మారింది

Update: 2024-08-30 03:18 GMT

వైసీపీలో ముంబయి నటి వ్యవహారం తలనొప్పిగా మారింది. పార్టీ అధినేత జగన్ కు ఇది ఇబ్బందికరంగా మారింది. అధికారం కోల్పోయిన వైసీపీకి చెందిన ఒక్కొక్క వ్యవహారం బయటపడుతుంది. వైసీపీలో బడా నేతల పేర్లు ఈ వ్యవహారంలో బయటకు వస్తుండటంతో లీడర్లు వణికిపోతున్నారు. నాడు చేసిన తప్పులకు ఇప్పుడు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందేమోనని భయపడిపోతున్నారు. ముంబయికి చెందిన ఒక నటికి వైసీపీ నేత ఒకరు వేధింపులకు గురి చేశారని ఆమె ఆరోపిస్తుంది. ఇందుకు నాడు పోలీసు అధికారులు తనపై తప్పుడు కేసులు నమోదు చేసి తన కుటుంబాన్ని వేధించారని చెబుతున్నారు. నేడు ముంబయి నటి విజయవాడ వచ్చి పోలీస్ కమిషనర్ కు వేధింపులపై ఫిర్యాదు చేసే అవకాశముంది.

వేధింపులకు గురి చేేసి...
ప్రభుత్వం మారడంతో ఈ వ్యవహారం బయటకు వచ్చింది. ఈ వేధింపులలో పోలీసు ఉన్నతాధికారులతో పాటు వైసీపీలో బడా నేతలున్నారని ఆమె ఆరోపించారు. తనను అక్రమ కేసుల్లో ఇరికించడమే కాకుండా తన కుటుంబాన్ని కూడా వేధింపులకు గురి చేశారన్నారు. అందువల్ల తాము నిద్రలేని రాత్రులను గడపాల్సి వచ్చిందన్నారు. ఈ కుట్రలో భాగస్వామిగా తనను చేయడానికి పోలీసు ఉన్నతాధికారులు తీవ్రంగా ప్రయత్నించారన్నారు. వైసీపీ నేతతో పాటు తనను వేధించిన పోలీసు అధికారులపైన కూడా చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. దీంతో వైసీపీలో కీలక భూమిక పోషించిన నేత ఒకరు ఇందులో భాగస్వామిగా మారినట్లు ఆమె చెబుతుంది.
ఉన్నతస్థాయి దర్యాప్తునకు
వైసీపీ అధికారంలో ఉన్నప్పడు ఆమె ఎవరికీ ఫిర్యాదు చేయలేదు. అయితే ప్రభుత్వం మారడంతో తనపై జరిగిన వేధింపుల వ్యవహారాన్ని ముంబయి నటి బయటపెట్టడంతో ఈ వివాదం ఎటు వైపునకు దారితీస్తుందోనన్న ఆందోళన వైసీపీ నేతల్లో పట్టుకుంది. ఇటు పోలీసు అధికారుల్లోనూ టెన్షన్ మొదలయింది. ముంబయి నటి నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు, హోమంత్రి అనితకు ఫిర్యాదుచేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ప్రభుత్వం ముంబయి నటి వ్యవహారంపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించింది. ముంబయి నటి నుంచి ఆన్‌లైన్ లో ఫిర్యాదు తీసుకుని విచారణ జరపాలని నిర్ణయించారు. ముంబయి నటి వ్యవహారంపై డీజీపీ కూడా స్పందించారు. పోలీసు ఉన్నతాధికారుల ప్రమేయంపై దర్యాప్తు జరిపి, నిజమని తేలితే శాఖపరమైన చర్యలు మాత్రమే కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు.


Tags:    

Similar News