Ys Jagan : జగన్ కు గుడ్ న్యూస్ చెప్పిన సీబీఐ కోర్టు

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జగన్ విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతించింది.;

Update: 2024-05-14 13:25 GMT
ys jagan,  chief minister, development programs, vijayawada
  • whatsapp icon

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జగన్ విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతించింది. ఈ నెల 16వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకూ యూరప్ పర్యటనకు అనుమతి ఇవ్వాలంటూ ముఖ్యమంత్రి జగన్ సీబీఐ కోర్టులో పిటీషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే సీబీఐ మాత్రం విదేశీ పర్యటనకు అనుమతివ్వవద్దని, జగన్ పై కేసులు చివరి దశకు చేరుకున్నాయని తెలిపింది.

వాదనలు విన్న...
అయితే ఇరువర్గాల వాదనలు విన్న సీబీఐ కోర్టు జగన్ విదేశీ పర్యటనకు అనుమతిస్తూ ఈరోజు ఆదేశాలు జారీ చేసింది. దీంతో జగన్ త్వరలోనే కుటుంబ సభ్యులతో కలసి విదేశీపర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. అయితే ఫోన్ నెంబరు, మెయిల్ ఐడీ వివరాలను కోర్టుకు, సీబీఐకి సమర్పించాలని కోరింది. దీంతో ఆయన త్వరలోనే విదేశీ పర్యటనకు బయలుదేరి వెళతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.


Tags:    

Similar News