చీఫ్ సెక్రటరీ పదవీకాలం పొడిగింపు

ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ పదవీ కాలాన్ని పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.;

Update: 2024-06-27 07:57 GMT
చీఫ్ సెక్రటరీ పదవీకాలం పొడిగింపు
  • whatsapp icon

ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ పదవీ కాలాన్ని పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆయన పదవీ కాలాన్ని ఆరు నెలల పాటు పొడిగించాలని నిర్ణయించింది. దీంతో ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ గా నీరబ్ కుమార్ ప్రసాద్ ఈ ఏడాది డిసెంబరు నెలాఖరు వరకూ కొనసాగనున్నారు.

ఆరు నెలలు...
ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ పదవీ కాలాన్ని పొడిగించాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక విజ్ఞప్తిని చేశారు. చంద్రబాబు విజ్ఞప్తిని పరిశీలించిన కేంద్ర ప్రభుత్వం సర్వీసుకాలం పొడిగించేందుకు అనుమతి మంజూరు చేసింది. ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా నీరబ్ కుమార్ ప్రసాద్ ఇటీవలే పదవీ బాధ్యతలను స్వీకరించారు.


Tags:    

Similar News