Andhra Pradesh : ఏపీకి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్.. నిధులు విడుదల
ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పర్యాటక రంగానికి నిధులను విడుదల చేసింది
ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పర్యాటక రంగానికి నిధులను విడుదల చేసింది. పర్యాటక రంగం అభివృద్ధికి కేంద్రం నుంచి 113.75 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసిందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. పర్యాటకాంధ్రప్రదేశ్ కు సహకరించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ప్రత్యేకంగా మంత్రి కందుల దుర్గేష్ ధన్యవాదాలు తెలిపారు. అఖండ గోదావరి, గండికోట అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ పథకమైన సాస్కి ద్వారా రూ.113.751 కోట్ల నిధులు విడుదలయ్యాయని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. ని
పర్యాటక రంగానికి...
కేంద్ర ప్రభుత్వం సాస్కి స్కీం 2024-25 ద్వారా విడుదల చేసిన నిధులతో ఆంధ్రప్రదేశ్ లో పర్యాటక అభివృద్ధికి నూతనోత్తేజం వచ్చిందని మంత్రి దుర్గేష్ తెలిపారు.. ఈ నిధులతో అఖండ గోదావరి, గండికోట ప్రాంతాల్లో మౌలిక వసతులు, సౌకర్యాల కల్పనతో పాటు పర్యాటకులను ఆకర్షించేలా ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. గండికోటను ఇండియన్ గ్రాండ్ కేనియన్ లా అభివృద్ధి చేయవచ్చన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆలోచనలను ఆచరణలో చేసి చూపిస్తామని ఈ సందర్భంగా తెలిపారు. కేంద్రం సాస్కి స్కీం ద్వారా తొలి విడతగా 66 శాతం నిధులు మంజూరు చేసిందని, ఆ నిధుల్లో 75 శాతం వినియోగించాక మిగతా 34 శాతం విడుదల చేస్తుందని ఉత్తర్వులో పేర్కొన్నట్లు మంత్రి దుర్గేష్ వివరించారు.