గ్రామీణ బ్యాంకులను విలీనం చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం

మే 1వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ లోని గ్రామీణ బ్యాంకులను విలీనం చేస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది

Update: 2025-04-09 03:41 GMT

మే 1వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ లోని గ్రామీణ బ్యాంకులను విలీనం చేస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. సప్తగిరి, ఆంధ్ర ప్రగతి, చైతన్య గోదావరి, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ పేర్లతో వేర్వేరుగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న గ్రామీణ బ్యాంకులను విలీనం చేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

ఇకపై ఏపీ గ్రామీణ బ్యాంక్...
ఇవన్నీ ఇకపై... 'ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్' పేరుతో పని చేస్తాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఇది అమరావతి ప్రధాన కార్యాలయంగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో పని చేస్తుందని గెజిట్ నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. మే 1వ తేదీ నుంచే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ పేరుతో లావాదేవీలను నిర్వహించాల్సి ఉంటుందని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.


Tags:    

Similar News