విష్ణు వర్ధన్ రెడ్డి కి కేంద్ర ప్రభుత్వం ‘X’ కేటగిరీ భద్రత

బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణు వర్ధన్ రెడ్డి కి కేంద్ర ప్రభుత్వం ‘X’ కేటగిరీ భద్రత కల్పించింది

Update: 2025-04-11 07:02 GMT

భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణు వర్ధన్ రెడ్డి కి కేంద్ర ప్రభుత్వం ‘X’ కేటగిరీ భద్రత కల్పించినట్లు కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర భద్రతా వ్యవహారాల కమిటీ సమావేశం, కేంద్ర హోంశాఖ మరియు కేంద్ర నిఘా సంస్థల మధ్య నిర్వహించిన సంప్రదింపుల అనంతరం, జాతీయ స్థాయి వీఐపీ రక్షణ విభాగం ఈ భద్రతా కేటగిరీని కేటాయించింది.

హోంశాఖ నిర్ణయం...
2025 ఏప్రిల్ 1వ జరిగిన సమావేశం నిర్ణయం మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీచేసింది. కేంద్రం పంపిన ఉత్తర్వుల ప్రకారం, ఈ భద్రతా ఏర్పాట్లు తక్షణమే అమలులోకి రావాలని స్పష్టం చేశారు. స్వంత రాష్ట్రమైన ఏపీతో పాటు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల్లోనూ ఆయన పర్యటించే సమయంలో ఈ భద్రత అమలులో ఉంటుంది.


Tags:    

Similar News