సోముకు చెక్.. టీడీపీ నుంచి వచ్చిన నేతలకు బీజేపీలో?
ఆంధ్రప్రదేశ్ లో కీలక నిర్ణయాలు తీసుకోవడానికి కేంద్ర నాయకత్వం కోర్ కమిటీని నియమించింది.
ఆంధ్రప్రదేశ్ లో కీలక నిర్ణయాలు తీసుకోవడానికి కేంద్ర నాయకత్వం కోర్ కమిటీని నియమించింది. మొత్తం 13 మందికి ఈ కమిటీలో చోటు కల్పించారు. వీరిలో సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్, సోము వీర్రాజు, జీవీఎల్ నరసింహారావు, కన్నా లక్ష్మీనారాయణ, పురంద్రీశ్వరి, సత్యకుమార్, మధుకరర్, ఎమ్మెల్సీ మాదవ్, నిమ్క జయరాజ్, చంద్రమౌళి, రేంలగి శ్రీదేవిలు కోర్ కమిటీలో సభ్యులుగా ఉన్నారు.
ప్రత్యేక ఆహ్వానితులుగా....
ప్రత్యేక ఆహ్వానితులుగా ముగ్గురిని నియమించారు. వీరిలో సునీల్ దేవధర్, శివప్రకాష్, మురళీధరన్ లను నియమించారు. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కోర్ కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకోవాలని కేంద్ర నాయకత్వం ఆదేశించింది. ఇక ప్రతి నెల కమిటీ సమావేశమై పార్టీ పరిస్థితి, రాజకీయ పరిస్థితులను గురించి చర్చించాలని కేంద్ర నాయకత్వం తెలిపింది. సోము వీర్రాజుకు చెక్ పెట్టేందుకే కోర్ కమిటీని నియమించిందన్న కామెంట్స్ వినపడుతున్నాయి.