ఇక జగన్ తోనే చర్చలు.. మరెవ్వరితో కాదు
ఏపీ ఉద్యోగుల చలో విజయవాడ కార్యక్రమం ముగిసింది. ఈ సందర్భంగా బీఆర్టీఎస్ రోడ్డులో ఏర్పాటు చేసిన సభలో నేతలు ప్రసంగించారు
ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల చలో విజయవాడ కార్యక్రమం ముగిసింది. ఈ సందర్భంగా బీఆర్టీఎస్ రోడ్డులో ఏర్పాటు చేసిన సభలో నేతలు ప్రసంగించారు. ఇక ప్రభుత్వంతో చర్చలు అనేవి ఉండవన్నారు. నేరుగా ముఖ్యమంత్రి జగన్ తో మాత్రమే తాము ఇక చర్చలు జరుపుతామని వారు తెలిపారు. తాము పెట్టిన ఏ డిమాండ్ ను కూడా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ప్రభుత్వం చలో విజయవాడ కార్యక్రమానికి అనేక ఆంక్షలు పెట్టినా లక్షలాది మంది ఉద్యోగులు విజయవాడకు వచ్చారన్నారు.
ప్రభుత్వమే ఆలోచించుకోవాలి....
ప్రభుత్వమే ఇప్పుడు ఆలోచించుకోవాలన్నారు. నాలుగు జేఏసీ లు కలసి ఇక పోరాటాన్ని ఉధృతం చేస్తామన్నారు. మూడేళ్లుగా ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. చలో విజయవాడ సూపర్ సక్సెస్ అయిందన్నారు. ఇక వెనకడగు వేసే ప్రసక్తి లేదని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ స్వయంగా జోక్యం చేసుకుంటేనే సమస్య పరిష్కారం అవుతుందని వారు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులతో పెట్టుకుంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని నేతలు హెచ్చరించారు. పారదర్శకంగా చర్చలు జరగాలన్నారు. ఈ నెల 7వ తేదీ నుంచి సమ్మెలోకి వెళుతున్నట్లు వారు ప్రకటించారు. తమది బలప్రదర్శన కాదని, ఆవేదని అని వారు అన్నారు.