నోట్ల రద్దు గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన ఏపీ సీఎం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నోట్ల రద్దు గురించి

Update: 2024-07-10 02:29 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నోట్ల రద్దు గురించి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో పెద్ద నోట్ల రద్దును ప్రధాని మోదీకి చెప్పింది తానేనని చంద్రబాబు నాయుడు పలు సందర్భాల్లో చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి నోట్ల రద్దు గురించి చెప్పారు. అలాగని ఇప్పుడు 2000, 1000 రూపాయలు నోట్లు లేవు కదా అని మీరు అనుకోవచ్చు. ఏపీ సీఎం చెబుతోంది 500, 200 రూపాయల నోట్లను కూడా రద్దు చేసేయాలని!!

అమరావతిలోని సచివాలయంలో విద్యుత్‌ శాఖపై శ్వేతపత్రం విడుదల సందర్భంగా మాట్లాడారు. కొందరు గత ఐదేళ్లలో కొట్టేసిన సొమ్ముతో వ్యవస్థను కొనుగోలు చేయాలని చూస్తున్నారని అన్నారు. ఇలాంటి వారి అవినీతిని అరికట్టాలంటే రూ.500, రూ.200 నోట్లు రద్దు చేసి డిజిటల్ కరెన్సీ తీసుకురావాలన్నారు. రూ.500, 200 నోట్లు కూడా రద్దు చేయాలని, డిజిటల్ కరెన్సీని ప్రోత్సహించాలని బ్యాంకర్లతో చెప్పామన్నారు. రాజకీయ ముసుగులో బెదిరిస్తే భయపడే ప్రసక్తి లేదన్నారు. నేరస్థులు, అవినీతి పరులు తప్పించుకోలేరని.. గత ప్రభుత్వ పాలనలో అన్ని వ్యవస్థలను ధ్వంసం చేశారని ఆరోపించారు.


Tags:    

Similar News