ఏసీబీ కోర్టులో రెండు బెయిల్ పిటిషన్లు దాఖలు చేసిన చంద్రబాబు
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఏసీబీ కోర్టులో టీడీపీ అధినేత తరఫు న్యాయవాదులు వేర్వేరుగా రెండు పిటిషన్లను దాఖలు చేశారు. బెయిల్, మధ్యంతర బెయిల్ కోసం రెండు పిటిషన్లు దాఖలు చేశారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయిన నేపథ్యంలో ఈ పిటిషన్లు దాఖలు చేశారు. సీఐడీకి నోటీసులు ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. దీంతో సీఐడీ రేపు కౌంటర్ దాఖలు చేయనుంది. ఈ పిటిషన్లు ఎల్లుండి విచారణకు వచ్చే అవకాశముంది.
స్కిల్ డెవలెప్‌మెంట్ కేసు విచారణ చేస్తున్న ఏసీబీ స్పెషల్ కోర్టు న్యాయమూర్తి జస్టిస్ హిమబిందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భద్రత పెంచింది. ఆమెకు 4+1 ఎస్కార్ట్‌తో భద్రత కల్పించారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగానే భద్రతను కల్పించినట్లు తెలుస్తోంది. ఏపీ ప్రభుత్వం అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వం భద్రత కల్పించింది. చంద్రబాబు స్కిల్ డెవలెప్‌మెంట్ కేసులో సీఐడీ తరఫున విజయవాడ ఏసీబీ కోర్టులో సుధాకర్ రెడ్డి వాదనలు వినిపిస్తున్నారు. దీంతో సుధాకర్‌రెడ్డికి 4 ప్లస్ 4 భద్రత కల్పించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.