Andhra Pradesh : ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్..చెప్పింది.. చెప్పినట్లుగానే
ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుంది
ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుంది. ఈ నెలాఖరులో ఉద్యోగ సంఘాల నేతలో చంద్రబాబు సమావేశం కానున్నారు. నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసిన ఏపీ ఎన్జీవోలకు ఆయన ఈ మేరకు హామీ ఇచ్చారు. ఉద్యోగ సంఘాలతో తాను ఈ నెలాఖరుకు సమావేశమవుతానని చెప్పారు.
ఇచ్చిన హామీల మేరకు...
ఎన్నికల సందర్భంగా కూటమి నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు అనేక హామీలు ఇచ్చాయి. వారికి ప్రతి నెల ఒకటో తేదీ జీతం ఇవ్వడంతో పాటు వారికి రావాల్సిన బకాయాలు తక్షణమే చెల్లించేలా చర్యలు తీసుకుంటామని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. అలాగే రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ప్రతి నెల ఒకటోతేదీన పింఛను అందిస్తామని చెప్పారు. దీంతో పాటు డీఏ పై కూడా తాము అన్ని రకాలుగా అనుకూలమైన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చంద్రబాబు ఈ నెలాఖరుకు ఉద్యోగ సంఘలు భేటీ కానున్నాయి. ఈ భేటీలో హామీల అమలుపై స్పష్టత రానుంది.