సిట్ కార్యాలయం లోకి చంద్రబాబు నాయుడు అడ్వొకేట్లను అనుమతించని పోలీసులు
సిట్ కార్యాలయం లోకి చంద్రబాబు నాయుడు అడ్వొకేట్లను అనుమతించని పోలీసులు
సిట్ కార్యాలయం లోకి చంద్రబాబు నాయుడు అడ్వొకేట్లను పోలీసులు అనుమతించలేదు. అధికారుల తీరుపై అడ్వకేట్ లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వ లాయర్లను అనుమతించి, చంద్రబాబు లాయర్లు నలుగురిని నిలిపివేశారని చెబుతున్నారు. ఉదయం అరెస్ట్ నుంచి ఇప్పటి వరకు అన్నిటిలో నిబంధనలకు విరుద్ధంగా దర్యాప్తు అధికారులు పని చేస్తున్నారని టీడీపీ శ్రేణులు ఆరోపణలు గుప్పిస్తూ ఉన్నాయి. అడ్వకేట్లను ఏ నిబంధనల ప్రకారం, ఎందుకు అనుమతించడం లేదో చెప్పాలంటూ డిమాండ్ చేశారు.
చంద్రబాబు అరెస్టు వ్యవహారంలో ఆయన తరఫున వాదించేందుకు డిల్లీ నుంచి వచ్చిన సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కోర్టు కాంప్లెక్స్‌కు చేరుకున్నారు. ఏసీబీ కోర్టులో చంద్రబాబు రిమాండ్ పిటిషన్‌పై వాదనలు ప్రారంభం కానున్నాయి.