Chandrababu : పులివెందులపై క్లారిటీ ఇచ్చిన చంద్రబాబు
కడప జిల్లాలో మహానాడు నిర్వహణపై నేతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు;

కడప జిల్లాలో మహానాడు నిర్వహణపై నేతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా పులివెందుల టీడీపీ నేతలపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. జిల్లా ఇంఛార్జ్ మంత్రి సవిత ఆధ్వర్యంలో నేతల కుమ్ములాటలపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఇంచార్జ్‌లదే పూర్తి బాధ్యత అని తేల్చి చెప్పారు. .
ప్రతి నియోజకవర్గంలో...
ప్రతి నియోజకవర్గంలో ఒక వర్గమే ఉండాలని, రెండవ వర్గానికి తావులేదని ముఖ్యమంత్రి చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. రెండు వర్గాలుగా విడిపోయి కార్యకర్తలను ఇబ్బందులు పెడితే ఊరుకోబోనని హెచ్చరించారు. పులివెందుల వ్యవహారంపై ఎమ్మెల్సీకి చురకలంటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కడపలో మహానాడు నిర్వహణకు అందరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు.