Chandrababu : పేదరిక నిర్మూలన చేయగలిగితే నా జన్మ ధన్యమయినట్లే
ఉగాది వేడుకలను విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు;

ఉగాది వేడుకలను విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమానికి ప్రారంభించిన చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ గతఐదేళ్లలో రాష్ట్రం కళ తప్పిందన్నారు. ప్రజలు ముందు అనే నినాదంతో తమ కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతుందన్న చంద్రబాబు పేదరిక నిర్మూలనకు ఈ ఉగాది నుంచి శ్రీకారం చుట్టనున్నామని తెలిపారు. తాను హైదరబాద్ లో ఐటీని ప్రమోట్ చేసినప్పుడు అందరూ నవ్వారని, అదే అందరికీ ఉపాధికి మార్గం అయిందని, హైదరాబాద్ కు అధిక ఆదాయం తెచ్చిపెడుతుందన్నారు.
క్వాంటమ్ వాలీని...
జాతీయ రహదారుల ఐడియా కూడా తాను వాజ్ పేయికి ఇచ్చినందున ఆయన అంగీకరించి అమలు చేశారన్న చంద్రబాబు ప్రస్తుతం క్వాంటమ్ వ్యాలీని ప్రారంభిస్తున్నామని తెలిపారు. అదే సమయంలో పీ4 పథకం కింద జీరో పావర్టీ నితీసుకురావాలన్న లక్ష్యంతో ముందుకు వెళుతున్నామని తెలిపారు. ఈకార్యక్రమం సక్సెస్ అయితే తన జీవితం ధన్యమయినట్లేనని చంద్రబాబు అన్నారు. తన జన్మ చరితార్థమవుతుందని ఆయన తెలిపారు. పేదరిక నిర్మూలన చేయాలన్న తన ఆకాంక్ష నెరవేరడానికి ఉగాది నుంచి ప్రారంభిస్తున్నామని తెలిపారు. ఈ సమావేశానికి మంత్రులు, అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉగాది పురస్కారాలను అందచేయనున్నారు.