చూస్తా.. రెండు నెలలు... మారకుంటే పీకిపారేస్తా
మంత్రులపై జగన్ సీరయస్ అయ్యారు. తేడా వస్తే ఇద్దరు, ముగ్గురిని మంత్రివర్గం నుంచి తప్పిస్తానని వార్నింగ్ ఇచ్చారు
మంత్రులపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ సీరయస్ అయినట్లు తెలిసింది. తేడా వస్తే ఇద్దరు, ముగ్గురిని మంత్రివర్గం నుంచి తప్పించడానికి కూడా వెనకాడనని చెప్పారు. తన వద్ద అందరి పనితీరు నివేదికలు ఉన్నాయని జగన్ తెలిపినట్లు తెలిసింది. మంత్రి వర్గ సమావేశంలో జగన్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది. ప్రభుత్వంపై విపక్షం నుంచి ఆరోపణలు వస్తున్నా ఎవరు స్పందించడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. రెండు నెలలు సమయమిస్తున్నానని, ఈలోపు పనితీరు మార్చుకోకుంటే మంత్రి వర్గం నుంచి తప్పిస్తానని వార్నింగ్ ఇచ్చారని తెలిసింది.
మంత్రులకు జగన్ వార్నింగ్....
ప్రధానంగా ఢిల్లీ లిక్కర్ స్కాం ఆరోపణల వ్యవహారంపై ఎవరూ స్పందించకపోవడాన్ని కూడా జగన్ తప్పు పట్టినట్లు తెలిసింది. తీరు మార్చుకోకుంటే కేబినెట్ లో మార్పులు తప్పవని జగన్ హెచ్చరించారని తెలిసింది. నాకేం పట్టిందని వ్యవహరించడం సరికాదని కూడా ఆయన అన్నారని చెబుతున్నారు. ఆరోపణలు వస్తున్నా చాలా మంది స్పందించడం లేదని ముఖ్యమంత్రి జగన్ కొందరు మంత్రుల పనితీరు పట్ల అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం.