నేడు ముస్లిం పెద్దలతో జగన్
ముస్లిం సామాజికవర్గం పెద్దలతో ఈరోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రత్యేకంగా సమావేశమవుతున్నారు;
ముస్లిం సామాజికవర్గం పెద్దలతో ఈరోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రత్యేకంగా సమావేశమవుతున్నారు. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు ఆయన తన క్యాంప్ కార్యాలయంలో సమావేశమవుతారు. ఈ కార్యక్రమానికి ముస్లిం సామాజికవర్గంలో ఉన్న పెద్దలతో పాటు, రాష్ట్రంలోని దర్గాల బాధ్యులు, మతగురువులు హాజరవుతున్నారు. ప్రధానంగా ముస్లిం సామాజికవర్గం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ సమావేశంలో చర్చిస్తారు.
సమస్యలపై సమగ్రంగా...
పెద్దలతో చర్చించిన తర్వాత ముస్లిం సామాజికవర్గానికి ప్రభుత్వం నుంచి చేయాల్సిన ప్రణాళికను రూపొందించనున్నారు. మరిన్ని సేవలు ఆ సామాజికవర్గానికి అందించాలన్న లక్ష్యంతోనే ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. ముస్లిం మత పెద్దల సలహాలతో సమగ్ర ప్రణాళికను రూపొందించి వాటికి అవసరమయ్యే నిధులను కేటాయించే అవకాశముందని చెబుతున్నారు.