కష్టమయితే తప్పుకోండి.. కొత్త వాళ్లను తెస్తా

జిల్లా అధ్యక్షులు, రీజనల్ కో - ఆర్టినేటర్ల సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ కొంత సీరియస్ గానే రియాక్ట్ అయినట్లు తెలిసింది.

Update: 2022-07-23 02:34 GMT

జిల్లా అధ్యక్షులు, రీజనల్ కో - ఆర్టినేటర్ల సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ కొంత సీరియస్ గానే రియాక్ట్ అయినట్లు తెలిసింది. కష్టమైతే తప్పుకోవాలని, కొత్త వాళ్లకు అవకాశమిస్తానని ఆయన అన్నారు. ఇచ్చిన పదవికి న్యాయం చేయాలని, చేయలేమని భావిస్తే స్వచ్ఛందంగా తప్పుకోవాలని జగన్ కొంత ఘాటుగానే స్పందించారు. ఇన్ ఛార్జులు పని భారం అనుకుంటే మానేయాలని, కొత్త వారికి బాధ్యతలను అప్పగిస్తానని జగన్ అన్నారు.

ఎమ్మెల్యేల పనితీరును....
రీజనల్ కో ఆర్డినేటర్లు ఖచ్చితంగా వారి పరిధిలో పది రోజులు తిరగాల్సిందేనని స్పష్టం చేశారు. జిల్లా అధ్యక్షులు అందరినీ సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యతను నెత్తికెత్తుకోవాలని సూచించారు. నియోజకవర్గానికి 1.20 కోట్ల రూపాయల అభివృద్ధి నిధులను కూడా కేటాయించామని, ప్రతి నెల ఆరు గ్రామ సచివాలయాలను ఎమ్మెల్యేలు సందర్శించేలా చూడాలని కోరారు. సరైన సమస్యలను గుర్తించాలంటే తిరగాల్సిందే. అలా తిరగని ఎమ్మెల్యేల పేర్లు తనకు చెప్పాలని, తాను నేరుగా పిలిచి మట్లాడతానని జగన్ జిల్లా ఇన్ ఛార్జులు, రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశంలో అన్నట్లు తెలిసింది.


Tags:    

Similar News