పరిశ్రమల ఏర్పాటుకు పూర్తి సహకారం
పారిశ్రామిక రంగానికి ప్రభుత్వం సహకారం పూర్తి స్థాయిలో ఇస్తుందని ముఖ్యమంత్రి జగన్ అన్నారు.
పారిశ్రామిక రంగానికి ప్రభుత్వం సహకారం పూర్తి స్థాయిలో ఇస్తుందని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. అచ్యుతాపురంలో ఆయన పలు పరిశ్రమలను ప్రారంభించారు. ఏటీసీ సెకండ్ ఫేజ్ కు జగన్ ప్రారంభోత్సవం చేశారు. ఎనిమిది కంపెనీలకు జగన్ భూమి పూజ చేశారు. ప్రభుత్వం పూర్తి సహకారం అందివ్వబట్టే పరిశ్రమలు ఏపీలో ఏర్పాటవుతున్నాయన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ప్రతి సంవత్సరం అవార్డులను అందుకుంటూనే ఉన్నామని జగన్ తెలిపారు. గతంలో ఏపీ వైపు చూడని పారిశ్రామికవేత్తలు కూడా ఈరోజు చూసేటట్లుగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన తెలిపారు.
స్థానికులకు 75 శాతం...
పరిశ్రమలకు పూర్తి సహకారం ఇస్తామని భరోసా ఇవ్వబట్టే ఇన్ని పరిశ్రమలు వస్తున్నాయన్నారు. వచ్చే నెలలో టాటా కంపెనీకి చెందిన పరిశ్రమ విశాఖపట్నంలో ప్రారంభమవుతుందన్నారు. పారిశ్రామికవేత్తలను పూర్తిగా ఈ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు ఇవ్వాలని ప్రభుత్వం చట్టం చేసిందని జగన్ గుర్తు చేశారు. ప్రజలు కూడా పరిశ్రమల ఏర్పాటుకు సహకరించాలని కోరారు. రాష్ట్రంలో వేగంగా పారిశ్రామికాభివృద్ధి జరుగుతుందన్నారు.
వచ్చే రెండేళ్లలో...
స్థానికులకే ఉద్యోగాలు వస్తాయని, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని జగన్ అన్నారు. మరిన్ని పెట్టుబడులు రావాలంటే ప్రజలు కూడా ప్రభుత్వానికి పూర్తి సహకారం అందించాలన్నారు. 3 ఇండ్రస్ట్రియల్ కారిడార్లు ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమేనని జగన్ అన్నారు. పదిహేడు కంపెనీలు ఆంధ్రప్రదేశ్ లో 39,350 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టాయన్నాు. వచ్చే రెండేళ్లలో మరో 56 పరిశ్రమలు ఏపీకి రాబోతున్నాయని చెప్పారు. 1.54 కోట్లతో లక్షమందికి పైగా ఉద్యోగాలు వచ్చాయని జగన్ అన్నారు. రాష్ట్రంలో తొమ్మిది ఫిషింగ్ హార్బర్లు ఏర్పాటు కాబోతున్నాయని, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. ఎంఎస్ఎంఈలకు పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు.