నేడు ఢిల్లీకి ఏపీ సీఎస్, డీజీపీ

చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి, డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాలు నేడు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు;

Update: 2024-05-16 04:32 GMT
administrative capital, jawahar reddy, chief secratary, visakha
  • whatsapp icon

ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ అనంతరం జరిగిన హింస కొనసాగుతుంది. ఈరోజు కొద్దిగా ఆగింది. పోలింగ్ జరిగిన రోజు నుంచి మూడు రోజుల పాటు పల్నాడు, రాయలసీమలోని అనేక ప్రాంతాల్లో వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణలు జరిగాయి. తలలు పగిలాయి. వాహనాలు ధ్వంసమయ్యాయి. అయితే ఎన్నికల కమిషన్ దీనిపై సీరియస్ అయింది.

ఈసీకి వివరణ ఇచ్చేందుకు...
ఎన్నికల అనంతరం హింసపై తమకు నివేదిక ఇవ్వాలని ఈసీ వివరణ కోరింది. దీంతో నిన్న అత్యవసరంగా సమావేశమైన చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి, డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాలు ఆ ప్రాంత ఎస్పీల నుంచి నివేదికలు తెప్పించుకున్నారు. నేడు ఇద్దరూ ఢిల్లీ వెళ్లి కేంద్ర ఎన్నికల కమిషనర్ ను కలవనున్నారు. ఎన్నికల అనంతరం హింసపై వివరణ ఇవ్వనున్నారు.


Tags:    

Similar News