రాజధాని నిర్మాణ పనులు ప్రారంభించనున్నాం : చీఫ్ సెక్రటరీ

రాజధాని అమరావతి ప్రాంతంలో చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ పర్యటించారు.

Update: 2024-06-09 12:35 GMT

రాజధాని ప్రాంతంలో చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ పర్యటించారు.అమరావతి లో ఆగిపోయిన పనులన్నీ త్వరలో ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. అమరావతి రైతులకు రావల్సిన రెండేళ్ల కౌలు నగదు ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ తో మాట్లాడి క్లియర్ చేస్తామని తెలిపారు. యుద్ద ప్రాతిపాదికన జంగిల్ క్లియరెన్స్ చేపట్టామని ఆయన తెలిపారు. ఈ ప్రాంతంలో 94 జేసీబీలతో జంగిల్ క్లియరెన్స్ చేస్తున్నామని నీరబ్ కుమార్ ప్రసాద్ తెలిపారు. జంగిల్ 12న ముఖ్యమంత్రిగా గా చంద్రబాబు ప్రమాణస్వీకారం అయిన తరువాత కార్యాచరణ ఉంటుందని చెప్పారు.

ఆదేశాలు అందాయి...
అమరావతిని అభివృద్ధి చేయాలని ఆదేశాలు వచ్చాయని ఆయన తెలిపారు. ఉద్దండరాయుని పాలెం ప్రాంతం నుంచి పనులు ప్రారంభిస్తున్నామని తెలిపారు. సీఎంతో పాటు మంత్రివర్గం ప్రమాణస్వీకారం పనులు ప్రారంభానికి ముహూర్తం ఖరారయిందన్న ఆయన పనులు త్వరగా తిన పూర్తి చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామని చెప్పారు. రైతుల సమస్యలు కూడా పరిష్కరిస్తామని నీరబ్ కుమార్ ప్రసాద్ తెలిపారు. అమరావతి అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతామని చెప్పారు.


Tags:    

Similar News