ఆ నాలుగేళ్లు సాక్షికి నవశకం.. జ్యోతికి నరకం
ఈ నాలుగేళ్ల గురించి సాక్షి పత్రిక నవశకం అంటూ చెప్పుకొచ్చింది. వైఎస్ జగన్ ప్రభుత్వం దేశంలోనే ఏ రాష్ట్రంలోనూ అమలుచేయని
సీఎం వైఎస్ జగన్ మోహన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు పూర్తీ అయింది. జగన్ నేటితో ముఖ్యమంత్రిగా నాలుగేళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు సేవా కార్యక్రమాలను చేపడుతున్నాయి. తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో సంబరాలు అంబరాలను తాకే విధంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. 2019లో నాలుగేళ్ల క్రితం ఇదే రోజు ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ఎన్నికల్లో 175 స్థానాలకు గాను వైసీపీ 151 స్థానాల్లో గెలుపొందింది. ఇదే సమయంలో 25 లోక్ సభ స్థానాలకు గాను 22 స్థానాల్లో గెలుపొందింది. ఎన్నికల మేనిఫెస్టోలోని హామీలను 98.4 శాతం పూర్తి చేశామని వైసీపీ చెబుతోంది. నవరత్నాల పేరుతో వైసీపీ ప్రభుత్వం పేదల సంక్షేమానికి పెద్ద పీట వేసింది. ఇప్పటి వరకు వివిధ పథకాల ద్వారా దాదాపు 2.10 లక్షల కోట్ల రూపాయలను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి వేసినట్టు ప్రభుత్వం చెపుతోంది. పలు ప్రాంతాల్లో వైసీపీ శ్రేణులు ఈరోజుని సెలెబ్రేట్ చేసుకుంటూ ఉన్నాయి. అన్న దానం, వస్త్రదానం వంటి పలు స్వచ్ఛంద కార్యక్రమాలు ఈ సందర్భంగా చేపట్టనున్నారు.