మూడు ప్రాంతాల్లో ఒబెరాయ్ హోటల్స్ కు సీఎం శంకుస్థాపన

విశాఖ, తిరుపతి ఒబెరాయ్ హోటల్స్ కు వర్చువల్ గా సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. అనంతరం అక్కడి వ్యూ పాయింట్..;

Update: 2023-07-09 05:38 GMT
oberoi hotel bhumi pooja

oberoi hotel bhumi pooja

  • whatsapp icon

సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండోరోజు కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. ఆదివారం ఉదయం గండికోటకు చేరుకున్న జగన్.. ఒబెరాయ్ హోటల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. విశాఖ, తిరుపతి ఒబెరాయ్ హోటల్స్ కు వర్చువల్ గా సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. అనంతరం అక్కడి వ్యూ పాయింట్ ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఒబెరాయ్ హోటల్స్ ఎండీ విక్రమ్ సింగ్ ఒబెరాయ్, డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, మంత్రులు ఆర్కే రోజా, ఆదిమూలపు సురేష్ పాల్గొన్నారు. ఒబెరాయ్ గ్రూప్ ఏపీలోని మూడు ప్రాంతాల్లో సెవెన్ స్టార్ హోటల్స్ ను నిర్మించనుంది. గండికోట, తిరుపతి, విశాఖపట్నంలో సెవెన్ స్టార్స్ హోటళ్ల నిర్మాణం జరగనుంది.

పులివెందులలో నూతనంగా నిర్మించిన మున్సిపల్ కార్యాలయ భవనాన్ని సీఎం ప్రారంభించనున్నారు. పులివెందుల రాణితోపు చేరుకుని నగరవనాన్ని ప్రారంభిస్తారు. అక్కడి నుంచి గరండాల రివర్ ఫ్రంట్ కు చేరుకుని గరండాల కెనాల్ డెవలప్ మెంట్ ఫేజ్ 1 పనులను సీఎం జగన్ ప్రారంభించనున్నారు. అనంతరం పులివెందులలో నిర్మించిన స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ ను, ఏపీ క్లార్ లో ఏర్పాటు చేసిన న్యూటెక్ బయో సైన్సెస్ ను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 2.30 గంటలకు పులివెందులలో వైఎస్సార్ స్పోర్ట్స్ అకాడమీని సీఎం జగన్ ప్రారంభించనున్నారు. ప్రారంభోత్సవాల కార్యక్రమాలు ముగిసిన అనంతరం జగన్ ఇడుపులపాయకు చేరుకుంటారు.


Tags:    

Similar News