చలితో వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు

రెండు తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగింది. కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.

Update: 2021-12-20 03:30 GMT

రెండు తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగింది. కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. దీంతో ప్రజలు ఉదయం పది గంటల వరకూ బయటకు వచ్చేందుకు భయపడిపోతున్నారు. గత పదేళ్లుగా ఇటువంటి వాతావరణ పరిస్థితులు చూడలేదని వాతావరణ శాఖ అధికారులు సయితం అభిప్రాయపడుతున్నారు.

అత్యల్పంగా....
తెలంగాణలో అత్యల్పంగా ఆదిలాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సిర్పూర్ లో రికార్డు స్థాయిలో ఆరు డిగ్రీల సెల్సియస్ నమోదయింది. తర్వాత గిన్నెదరిలో 6.4, సోనాలలో 7.2 సెల్సియస్ నమోదయింది. ఆంధ్రప్రదేశ్ లో అత్యల్పంగా ఏజెన్సీ ప్రాంతమయిన చింతపల్లిలో ఉష్ణోగ్రత నమోదయింది. ఇక్కడ 8.7 సెల్సియస్ నమోదయింది. దీంతో ప్రజలు చలికి వణికిపోతున్నారు.


Tags:    

Similar News