Weather Report : సింగిల్ డిజిట్ కు పడిపోయిన ఉష్ణోగ్రతలు
ఆంధ్రప్రదేశ్ లో చలిగాలులు ప్రవేశించాయి. నవంబరు నెల కావడంతో ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి
ఆంధ్రప్రదేశ్ లో చలిగాలులు ప్రవేశించాయి. నవంబరు నెల కావడంతో ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. చలిగాలులు చంపేస్తున్నాయి. అతి తక్కువ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కానుండటంతో ఇక్కడకు పర్యాటకుల సంఖ్య కూడా ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అనేక ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
కనిష్ట స్థాయికి పడిపోయి...
ఏజెన్సీలో గతంలో ఎన్నడూ లేని విధంగా కనిష్టస్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఏడేళ్ల తర్వాత ఇంతటి కనిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయినట్లు అధికారులు తెలిపారు. అల్లూరు సీతారామరాజు జిల్లాలోని పాడేరు ఏజెన్సీలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ సీజన్ లో తొలిసారి సింగిల్ డిజిట్ కు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ముంచింగిపుట్టు వద్ద 9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పాడేరు లో పన్నెండు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయినట్లు అధికారులు తెలిపారు.