Andhra Pradesh : నేడు రెండో రోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్ ఎస్సీలతో కూడా
ఆంధ్రప్రదేశ్ లో నేడు రెండో రోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరగనుంది.
ఆంధ్రప్రదేశ్ లో నేడు రెండో రోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కలెక్టర్లతో చంద్రబాబు వివిధ అంశాలపై చర్చించనున్నారు. ఈరోజు ఎస్పీలతో కూడా చంద్రబాబు సమావేశం కానున్నారు. కలెక్టర్లతో ప్రభుత్వ ప్రాధాన్యాతలు చర్చించిన తర్వత జిల్లా ఎస్పీలతో నేడు సమావేశమవుతారు.
శాంతి భధ్రతలపై...
రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితులపై సమీక్ష నిర్వహిస్తారు. జిల్లా ఎస్పీలు ప్రధానంగా మహిళలపై అత్యాచారాలు, దాడులు వంటివి జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించనున్నారు. ఇప్పటి వరకూ నమోదయిన కేసుల పురోగతిని కూడా ప్రస్తావించే అవకాశాలున్నాయి. శాంతిభద్రతలు కాపాడేందుకు రాజీ లేకుండా వ్యవహరించాలన్న ఆదేశాలను చంద్రబాబు ఎస్పీలకు ఇవ్వనున్నారు.