కరోనా పై అలర్ట్గానే ఉన్నాం: ఏపీ సర్కార్

కరోనా విషయంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తంగానే ఉందని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జె నివాస్ తెలిపారు

Update: 2022-12-21 12:56 GMT

కరోనా విషయంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తంగానే ఉందని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జె నివాస్ తెలిపారు. నిరంతరం పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. నవంబరు నెల నుంచి ఇప్పటి వరకూ ముప్పయి వేల నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహించగా 130 పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయని ఆయన పేర్కొన్నారు.

ఆక్సిజన్, ఐసీయూ బెడ్స్ సిద్ధం...
ఒమిక్రాన్ తప్ప కొత్త వేరియంట్ లేవీ నమోదు కాలేదని జె నివాస్ తెలిపారు. జినోమ్ సీక్వెన్సింగ్ టెస్ట్ ను కూడా ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 29 ల్యాబ్ లు అందుబాటులో ఉన్నాయని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్సిజన్, ఐసీయూ బెడ్స్ ను సిద్ధంగా ఉంచామని తెలిపారు. ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లతో పాటు మందులు కూడా అందుబాటులో ఉన్నాయని, భయపడాల్సిన, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. వైఎస్సార్ క్లినిక్ లలోనూ నిరంతర పర్యవేక్షణ ఉంటుందని జె.నివాస్ తెలిపారు.


Tags:    

Similar News