మరోసారి చర్యలకు ఆహ్వానించిన మంత్రుల కమిటీ
ఉద్యోగ సంఘాలను బుజ్జగించేందుకు ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీ నేడు మరోసారి చర్చలకు ఆహ్వానించింది
ఉద్యోగ సంఘాలను బుజ్జగించేందుకు ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీ నేడు మరోసారి చర్చలకు ఆహ్వానించింది. ఉద్యోగ సంఘాలు చర్చలకు రావాల్సిందిగా జీఏడీ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్ ఉద్యోగ సంఘాల నేతలకు ఫోన్ చేసి ఆహ్వానం అందజేశారు. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు సచివాలయంలో మంత్రుల కమిటీతో చర్చలకు రావాలని ఉద్యోగ సంఘాల నేతలను శశిభూషణ్ కోరారు.
నేడు మరోసారి....
నిన్న కూడా మంత్రుల కమిటీ సచివాలయంలో ఉద్యోగ సంఘాల నేతల కోసం ఎదురు చూసింది. అయితే పీఆర్సీ మీద ప్రభుత్వం జారీ చేసిన జీవోను రద్దు చేస్తేనే చర్చలకు వస్తామని ఉద్యోగ సంఘాలు తెలిపాయి. అశుతోష్ మిశ్రా కమిటీ పీఆర్సీపై రూపొందించిన నివేదికను కూడా బయటపెట్టాలని కోరాయి. జీవోను రద్దు చేయకుంటే తాము చర్చలకు వచ్చేది లేదని స్పష్టం చేశాయి. మరి ఈరోజు చర్చలకు వస్తారా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.