RGV : వర్మకు వారం రోజులు భారీ ఊరట
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో భారీ ఊరట లభించింది.
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో భారీ ఊరట లభించింది. తదుపరి చర్యలు తీసుకోవద్దంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తనపై ఆంధ్రప్రదేశ్ లో వరసగా నమోదయిన కేసులన్నీ క్వాష్ చేయాలని రామ్ గోపాల్ వర్మ క్వాష్ పిటీషన్ వేశారు. దీనిపై విచారించిన న్యాయస్థానం వర్మపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు సూచించింది. ఈ మేరకు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
వచ్చే సోమవారానికి...
రామ్ గోపాల్ వర్మ క్వాష్ పిటీషన్ పై వివరాలను సమర్పించాలని పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. రామ్ గోపాల్ వర్మ పై ఏపీలో వరసగా పోలీసు కేసులు నమోదయ్యాయి. సోషల్ మీడియాలో చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేష్ పై అనుచిత ట్వీట్లు పెట్టారంటూ అందిన ఫిర్యాదుల మేరకు ఆయనపై కేసులు నమోదయ్యాయి. దీంతో వర్మ హైకోర్టును ఆశ్రయించడంతో ఆయనకు ఊరట లభించింది.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Download the app now