Breaking : వర్మకు బెయిల్.. భారీ ఊరట
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ముందస్తు బెయిల్ లభించింది.;
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ముందస్తు బెయిల్ లభించింది. ఈ మేరకు హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. ముందస్తు బెయిల్ లభించడంతో రామ్ గోపాల్ వర్మకు ఊరట లభించినట్లయింది. ప్రకాశం, అనకాపల్లి, తుళ్లూరు లో నమోదయిన కేసుల్లో ఆయనకు ముందస్తు బెయిల్ లభించిందని న్యాయవాదులు తెలిపారు.
విచారణకు హాజరు కావాలని...
రామ్ గోపాల్ వర్మ తనపై ఆంధ్రప్రదేశ్ లో నమోదయిన కేసుల్లో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ పై నేడు విచారణ జరిగింది. అయితే వర్మకు ముందస్తు బెయిల్ ఇస్తూనే పోలీసులు పిలిచినప్పుడు హాజరై విచారణకు సహకరించాలని కోర్టు ఆదేశించింది. చంద్రబాబు, పవన్, లోకేష్ పై అనుచిత పోస్టులు పెట్టినందుకు వర్మపై కేసులు నమోదయ్యాయి.