రష్యా - ఉక్రెయిన్ యుద్ధం : భారత్ లో భారీగా పెరిగిన వంట నూనెల ధరలు

ఉదయం 10 గంటల సమయంలో లీటర్ పామాయిల్ ధర రూ.128 ఉండగా.. మధ్యాహ్నం 12 గంటలు అయ్యే సరికి ఏకంగా ..

Update: 2022-02-27 05:29 GMT

విజయవాడ : రష్యా - ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతోన్న యుద్ధం భారత్ వ్యాపారులకు కలిసొచ్చింది. ఎప్పుడు సందు దొరుకుతుందా.. రేట్లు పెంచేద్దాం అని ఎదురుచూస్తున్న వ్యాపారులకు ఇప్పుడు రష్యా - ఉక్రెయిన్ సంక్షోభం లాభాలు తెచ్చిపెడుతోంది. ఆ యుద్ధంతో భారత్ కు ఎలాంటి సంబంధం లేకపోయినా.. నూనె మిల్లులన్నీ దేశంలోనే ఉన్నా వంటనూనె ధరలు అమాంతం పెరిగిపోయాయి. రెండు గంటల వ్యవధిలో లీటర్ పామాయిల్ ధర రూ.20 పెరగడం సామాన్యుడిని నివ్వెరపోయేలా చేసింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో వంటనూనెల ధరలు గంటల వ్యవధిలోనే పెరిగిపోయాయి.

శుక్రవారం ఉదయం 10 గంటల సమయంలో లీటర్ పామాయిల్ ధర రూ.128 ఉండగా.. మధ్యాహ్నం 12 గంటలు అయ్యే సరికి ఏకంగా రూ.149కి పెరిగింది. రెండు గంటల్లో ఏకంగా రూ.21 పెరిగిపోవడం వినియోగదారుడిని ఆశ్చర్యపరిచింది. వంటనూనెల ధరలు ఇంతలా ఎందుకు పెరిగాయని అడిగిన వారికి.. వ్యాపారులు రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని సాకుగా చెప్తుండటం గమనార్హం. కరోనా పాండమిక్ సమయంలో కంటే.. ఇప్పుడు మరింతగా నిత్యావసర వస్తువుల ధరలు పెరగవచ్చంటూ వినియోగదారులను భయపెడుతున్నారు. విజయవాడ వ్యాప్తంగా వంటనూనెల ధరలు ఇలాగే ఉన్నాయి. కేంద్ర ఆహార మంత్రిత్వశాఖ తన వెబ్‌సైట్‌లో పేర్కొన్న దానికి, ఏమాత్రం పొంతన లేకుండా ఉండడం గమనార్హం.


Tags:    

Similar News