కొడాలి నానిపై అరెస్ట్ వారెంట్
మాజీ మంత్రి కొడాలి నానిపై అరెస్ట్ వారెంట్ జారీ చేయలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది
మాజీ మంత్రి కొడాలి నానిపై అరెస్ట్ వారెంట్ జారీ చేయలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. గవర్నర్‌పేట సీఐకి న్యాయమూర్తి గాయత్రిదేవి ఆదేశాలు జారీ చేశారు. 2016 నాటి కేసులో ప్రజాప్రతినిధుల న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. 2016 మే 10న పోలీసు ఉత్తర్వులు లెక్క చేయకుండా కొడాలి నాని, కొలుసు పార్థసారధి భారీ ర్యాలీ నిర్వహించారు.
2016 కేసుకు సంబంధించి...
ఈ కేసుకు సంబంధించి పలుమార్లు కోర్టుకు హాజరు కాకపోవడంతో ప్రజాప్రతినిధుల న్యాయస్థానం కొడాలి నానికి అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అయితే కొడాలి నాని తన న్యాయవాదుల ద్వారా కోర్టుకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు చెబుతున్నారు.