ఈవీఎం ధ్వంసం కేసులో టీడీపీ నేతల అరెస్ట్

ఏపీలో ఎన్నికల సందర్భంగా ఈవీఎం ధ్వంసం కేసులో టీడీపీ నేతలకు కోర్టు రిమాండ్ విధించింది

Update: 2024-05-22 12:42 GMT

tdp, candidate, mlc of local bodies, visakha district

ఏపీలో ఎన్నికల సందర్భంగా ఈవీఎం ధ్వంసం కేసులో టీడీపీ నేతలకు కోర్టు రిమాండ్ విధించింది. ఈ క్రమంలో నలుగురు టీడీపీ నేతలకు పథ్నాలుగు రోజులు రిమాండ్ విధిస్తూ బుధవారం కోర్టు ఆదేశించింది. ఏపీలో ఎన్నికల సందర్భంగా పల్నాడు జిల్లాలో టీడీపీ నేతలు ఈవీఎంలను ధ్వంసం చేశారన్నారు. తుమృకోటలోని 203, 204, 205, 206 పోలింగ్ బూత్లోని ఈవీఎంలను టీడీపీ నేతలు ధ్వంసం చేశారని పోలీసులు కేసు నమోదు చేశారు.

అరెస్ట్ చేసి...
ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు వెంకట సతీష్, కోటయ్య, సైదులు, మహేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో, వారిని కోర్టులో హాజరుపరచగా నలుగురు టీడీపీ నేతలకు 14 రోజులు రిమాండ్ విధించింది. అలాగే, మరో 50 మంది టీడీపీ కార్యకర్తలపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో కొంతమంది టీడీపీ నేతలు, కార్యకర్తలు అరెస్ట్ భయంతో పరారయ్యారు.


Tags:    

Similar News