Srisailam : శ్రీశైలంలో ఒక్కసారిగా పెరిగిన రద్దీ
శ్రీశైలంలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. ఆదివారం కావడంతో ఎక్కువ మంది భక్తులు మల్లన్న దర్శనానికి వచ్చారు;

శ్రీశైలంలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. ఆదివారం కావడంతో ఎక్కువ మంది భక్తులు మల్లన్న దర్శనానికి వచ్చారు. క్యూ లైన్ లన్నీ భక్తులతో నిండిపోయాయి. మల్లన్న దర్శనానికి మూడు గంటలకు పైగానే సమయం పడుతుందని ఆలయ అధికారులు తెలిపారు. దీంతో భక్తులు ఇబ్బంది పడకుండా ఆలయ అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
రద్దీ పెరగడంతో...
భక్తుల రద్దీ పెరగడంతో ఆలయ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా అభిషేకాలు,కుంకుమార్చనలు అధికారులు రద్దు చేసినట్లు తెలిపారు. శని,ఆది, సోమవారల్లో ఉదయం,7.30 గంటలకు, రాత్రి 9 గంటలకు రెండు విడతలుగా స్పర్శ దర్శనానికి అనుమతి ఇస్తున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.