Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ నేడు ఎంతో తెలుసా?

తిరుమలలో భక్తుల రద్దీ కొంత తగ్గింది. నేడు భోగి పండగ కావడంతో పాటు సోమవారం కావడం కూడా రద్దీ తగ్గడానికి కారణం;

Update: 2025-01-13 03:32 GMT

తిరుమలలో భక్తుల రద్దీ కొంత తగ్గింది. నేడు భోగి పండగ కావడంతో పాటు సోమవారం కావడం కూడా భక్తుల రద్దీ తగ్గడానికి కారణమని అధికారులు చెబుతున్నారు. సాధారణంగా సోమవారం నుంచి గురువారం వరకూ తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగానే ఉంటుంది. సంక్రాంతి మూడు రోజులు పాటు సెలవు దినాలు కావడంతో ఎక్కువ మంది భక్తులు వస్తారని భావించినా భోగి పండగ కావడంతో ఇంటివద్దనే ఉన్నారు. అయితే తిరుపతి స్థానిక ప్రజలు భోగి పండగ చేసుకున్న అనంతరం తిరుమల శ్రీవారి దర్శనం చేసుకుంటారు. పండగ రోజు వెంకటేశ్వరస్వామిని దర్శించుకుంటే మంచిదని, శుభప్రదమని భావిస్తారు. అదే సమయంలో వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి కూడా ఉత్తర ద్వారం నుంచి దర్శించుకోవడానికి ముందుగానే టిక్కెట్ చేసుకున్న భక్తులు తిరుమలకు చేరుకున్నారు. దీంతో తిరుమలలో భక్తుల రద్దీ అంతంత మాత్రంగానే ఉంది. రేపు సంక్రాంతి కావడంతో పెద్దగా భక్తులు రాలేదని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. అందరూ స్వగ్రామానికి చేరుకురని సంక్రాంతి పండగకు వెళ్లడంతో తిరుమలకు భక్తుల తాకిడి తగ్గిందనే చెప్పాలి.

మూడు రోజుల పాటు...
మూడు రోజుల పాటు వరసగా సెలవులు రావడం వల్ల కూడా తిరుమలకు భక్తులు వచ్చే అవకాశం ఎక్కువగా లేదు. ఈ మూడు రోజుల పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులతో పాటు అయ్యప్పమాల వేసుకుని శబరిమల వెళ్లి స్వామిని దర్శించుకునేందుకు వచ్చే వారి సంఖ్యతో ఎక్కువగా ఉంది. అందుకే తిరుమలలో నేడు పెద్దగా రష్ లేదని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. నిన్న తిరుమల శ్రీవారిని 70,966 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో15,681 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 2.95 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు వెల్లడించారు. తిరుమలలో తొక్కిసలాట జరిగి ఆరుగురు మరణించిన ఘటనతో కొంత రద్దీ తగ్గిన మాట వాస్తవమే. అయితే ఈ పరిస్థితి ఎక్కువ కాలం ఉండదని అధికారులు తెలిపారు.


Tags:    

Similar News